వైజాగ్‌లో పూలవర్షంతో రాజమౌళి, బ్రహ్మాస్త్ర టీమ్‌కు స్వాగతం
Rajamouli, Ranbir Kapoor, Ayan Mukherjee
బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్ హీరోగా అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోంది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటిభాగం ప్రీరిలీజ్ వేడుక వైజాగ్‌లో జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నమే విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు టీమ్ చేరుకోగానే పూలవర్షంతో స్వాగతం పలికారు అక్కడనుంచి స్టేడియం వరకు కారులో వెలుతుంటే అభిమానులు, నిర్వాహకులు హడావుడి చేశారు. ఈ చిత్ర సమర్పకుడు రాజమౌళికి ఈ సందర్భంగా గౌరవం దక్కింది. బృందం క్రేన్ గార్లాండ్ & గులాబీ రేకులతో స్వాగతం పలికింది.
తమ కారులో ఉండగా రణబీర్‌కి, రాజమౌళికి అభిమానులు గజ మాలతో స్వాగతం చెప్పారు. పాన్ ఇండియా సినిమాగా హిందీలో “బ్రహ్మాస్త్ర” తెలుగులో “బ్రహ్మాస్త్రం” రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి సమర్పకుడు. ఈ హడావుడి చూస్తుంటే ముందుముందు రణబీర్‌కు మన తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చేలా ఉందని చెప్పాలి.