బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (16:34 IST)

దేవుని పటాలపై రాజమౌళి, మహేష్ బాబు సినిమా పూజతో ప్రారంభం

Rajamouli and Mahesh Babu
Rajamouli and Mahesh Babu
దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం  కొత్త సంవత్సర సందర్భంగా గురువారంనాడు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాదాపూర్ దగ్గరలో వున్న అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో దేవుని పటాలపై ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు.
 
ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ హాజరయ్యారు. దేవునిపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు విజయేంద్ర ప్రసాద్ క్లాప్ కొట్టగా, ఎస్.ఎస్. రాజమౌళి కెమేరా స్విచ్చాన్ చేశారు. నేడు లాంభచనంగా పూజా కార్యక్రమాలతో నిర్వహించిన మహేష్ బాబు 29 చిత్రం వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
దుర్గా ఆర్ట్స్ బేనర్ పై పలు చిత్రాలు నిర్మించి చాలాకాలం గేప్ తీసుకున్న కె.ఎల్. నారాయణ ఈ సినిమాలో భారీ నిర్మాతగా మారుతున్నారు. ఎస్. గోపాల్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. బహుశా రాజమౌళి చీఫ్ గెస్ట్ గా సాయంత్రం గేమ్ ఛేంజర్ లో ఈవెంట్ లో పాల్గొంటున్నారు. అక్కడ మహేష్ బాబు సినిమా గురించి తెలియజేస్తారని అభిమానులు   భావిస్తున్నారు.