బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2024 (14:53 IST)

సాయి కుమార్ కీ రోల్ చేసిన ప్రణయ గోదారి చిత్రం రివ్యూ

sadan, priyanka, sunil
sadan, priyanka, sunil
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా, సాయి కుమార్, జబర్ దస్త్ రాజమౌళి, ప్రుధ్వీ తదితరులు నటించిన చిత్రం 'ప్రణయ గోదారి'. పిఎల్ విఘ్నేష్ దర్శక నిర్మాత. పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. సంగీతం మార్కండేయ నిర్వహించారు. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ అయింది. మరి గోదారి అందాలను చూపించామంటున్న ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ:
సిటీలో వుంటూ జాబ్ కోసం ఇంటర్వూకు తన స్నేహితురాలితో కలిసి వెళుతున్న ప్రియాంక ప్రసాద్ ను నలుగురు కుర్రాళ్ళు కిడ్నాప్ కు ప్రయత్నిస్తారు. అప్పుడే అటుగా వస్తున్న సదన్ వారిని కాపాడతాడు. తొలిచూపులోనే సదన్ ను చూసి ప్రియాంక ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత జాబ్ కూడా వస్తుంది. అయితే చిన్నతనంలో దేవుని మొక్కువుందని అది తీర్చుకోవడానికి గుడికి వెళ్ళమని ఊరిలో వున్న ప్రియాంక అమ్మ చెబుతుంది. అప్పుడు సదన్ ను తోడుగా తీసుకుని గుడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్లగానే అక్కడ పిచ్చివాడులా వున్న ఓ వ్యక్తి వీరిని శీను, గొయ్యి అని పిలుస్తూ నేను మీ జతకాడిని అంటూ వెంటపడి విసిగిస్తాడు. 
 
ఆ తర్వాత కట్ చేస్తే.. ఫ్లాష్ బ్యాక్ లో కథ సాగుతుంది. గోదారికి చెందని పెదకాపు (సాయికుమార్) 40 గ్రామాలకు పెద్ద దిక్కు. ఆయన చెప్పిందే తీర్పు. ఆయన కూతురు ఉషశ్రీ, మేనల్లుడు శీను. తన కూతురిని ఇచ్చి పెండ్లిచేయాలనుకున్న పెదకాపుకు శీను అక్కడ జాలరీ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెండ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? అసలు పెదకాపు కూతురును ఎందుకు వద్దనుకున్నాడు? ఆ శీనుకూ, ఇప్పుడు సదన్ కు లింక్ ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ చిత్ర కథ గత జన్మ, పరువు హత్యల నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు కథ ఏకాలంనాటిదో చెప్పకపోయినా గోచీ అనే పాత్రను గత కాలం అనిపిస్తుంది. పునర్జన్మ నేపథ్యంలో గతంలో పలు సినిమాలు కూడా వచ్చాయి. దర్శకుడు విఘ్నేశ్ తీసుకున్న కథావస్తువు బాగుంది. దానిని పరువు హత్యలతో ముడిపెడుతూ చూపించాడు. చెప్పే క్రమంలో కొంత గాడితప్పాడు. ఓ సాదాసీదాగా కథను చెప్పుకుంటూ పోయాడు మినహా ఎక్కడా ట్విస్ట్ లు అనేవి కనిపించవు. ఇందులో గోచీ పాత్ర వ్యక్తి కీలకమైనా ఇప్పటి జనరేష్ అంతసేపు చూడడం కష్టమే. గతంలో పదహారేళ్ల వయస్సులో చంద్రమోహన్ ఇలాంటి పాత్ర వేశాడు. కానీ ఇందులో ఆ పాత్రతో ఎంటర్ టైన్ మెంట్ చేయించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సెకండాఫ్ లో సాయికుమార్ చెప్పే డైలాగ్ లు ఆలోచింపజేస్తాయి. కథనాన్ని మరింత ఆసక్తిగా రాసుకుంటే సినిమా మరోలా వుండేది.
 
ఇక నటీనటుల పరంగా సదన్, ప్రియాంక పాత్రలు బాగానే వున్నాయి. సాయికుమార్ పాత్ర చెప్పాల్సిన పనిలేదు. మిగిలిన పాత్రలు వారి పరిధితమేరకు నటించారు. ప్రుధ్వీ, అతని కొడుకు రాజమౌళి పాత్రలు గ్రామీణ ప్రాంతంలో వుంటే సహజత్వంగా చూపించారు. ఆ క్రమంలో రాజమౌళి చేసే చేష్టలు కాస్త పాలిష్ గా చూపిస్తే బాగుండేది. గోచీ పాత్ర వేసిన సునీల్ డైలాగ్ డెలివరీ అంతా బాగానే వుంది. 
 
సాంకేతికంగా సినిమాటోగ్రఫీ ఓకే. సంగీతం పాటలపరంగా నేపథ్య సంగీతం మార్కండేయ బాగానే చేశాడు. నిర్మాణపరంగా విలువలతో సినిమా తీశారు. ఎడిటింగ్ కాస్త పదునుపెట్టాల్సింది. దర్శకుడు తను చెప్పాల్సిన కథను నటీనటులపై మరింత కసరత్తుచేస్తే బాగుండేది. కొందరు కొత్తవారైనా బాగానే చేసినా కొంత ఫీల్ లోపించింది. పాత ఫార్మెట్ అయినా తన శైలిలో చూపించే ప్రయత్నం చేశాడు.
రేటింగ్: 2/5