బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (19:40 IST)

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

Dhoom Dham
Dhoom Dham
నటీనటులు : చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ రామస్వామి, మ్యూజిక్ : గోపీ సుందర్, ప్రొడ్యూసర్ : ఎంఎస్ రామ్ కుమార్, స్టోరీ స్క్రీన్ ప్లే : గోపీ మోహన్, డైరెక్టర్ : సాయి కిషోర్ మచ్చా
 
కథ :
కార్తీక్ (చేతన్ కృష్ణ) జల్సాగా ఫ్రెండ్స్ కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. కార్తీక్  అంటే  తండ్రి (సాయి కుమార్)కి మితిమీరిన ప్రేమ. తన కొడుకు మాత్రమే నంబర్ వన్ గా చూడాలనుకుంటాడు. ఆ టైంలో కార్తీక్ జీవితంలోకి సుహానా (హెబ్బా పటేల్) వస్తుంది. తను ప్రేమిస్తాడు. ఆమె మాత్రం నిరాకరిస్తుంది. ఆ తర్వాత పొలెండ్‌కు జాలీ ట్రిప్‌కు వెళ్లిన కార్తీక్‌కు సుహానా కలుస్తుంది. నాటకీయ పరిణామలతో పోలెండ్ అమ్మాయితో నిశ్చితార్థందాకా వచ్చి బెడిసికొడుతుంది. అసలు కార్తీక్ లైఫ్ ఎందుకిలా జరుగుతుంది? కార్తీక్ తండ్రి   తన కొడుకు కోసం చేసిన పొరపాటు ఏమిటి ?, అసలు సుహానా ఎవరు? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
 టైటిల్ కు తగినట్లే ధూమ్ ధామ్ గా ఈసినిమా తీశారు. పాజిటివ్ కోణంలో కుటుంబంతో సహా కలిసి చూసేలా సినిమా వుంటుంది. ఎక్కడా వల్గారిటీ వుండదు. తండ్రికొడుకులు మధ్య వుండే ప్రేమను హైలైట్ చేస్తూ కథను రాసుకున్నాడు. దానికి గోపీమోహన్ మాటలు మరింత తోడయ్యాయి. అన్ని అంశాలున్న చిత్రమిది. లవ్, కామెడీ, లవ్ సీన్స్ పెళ్లి సీక్వెన్స్ బాగున్నాయి. ఎంటర్ టైన్ మెంట్ కు తగినట్లు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి.
 
ప్రధానంగా హీరోగా చేతన్ కృష్ణ అమాయకత్వంతోపాటు ప్రేమ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. తండ్రిగా సాయి కుమార్ పాత్రకి పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ హెబ్బా పటేల్ తన గ్లామర్ తో అలరించింది. ఇక మిగిలిన వారు గోపరాజు రమణ మేనరిజమ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చిన వెన్నెల కిషోర్ హైలైట్. పంచ్ లు,  కామెడీ టైమింగ్ కూడా అలరిస్తోంది. శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్ అమరారు.
 
సాంకేతికంగా చూస్తే, గోపీ సుందర్ సంగీతం కథకు బాగా హెల్ప్ అయింది. సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం బాగుంది. అయితే స్క్రిప్ట్ లో మరింత కసరత్తు చేస్తే బాగుండేది.
 
అయితే ఎంత బాగా డీల్ చేసినా, స్క్రీన్ ప్లే రచయితగా గోపీ మోహన్ కొన్ని చోట్ల తడబడ్డాడు. ఉత్కంఠ రేకెత్తిస్తూ ఎంటర్ టైన్ వేలో సాగే చేసిన ప్రోసెస్ లో కొంత సాగదీతగా అనిపిస్తుంది.  సెకండ్ హాఫ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫన్ ఎలిమెంట్స్, ఫస్ట్ హాఫ్ లో మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాకి మైనస్ అయ్యింది.
 
ప్రధానంగా లాజిక్ లేకుండా  సన్నివేశాలు కనిపిస్తాయి. అదేవిధంగా హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ ట్రాక్ మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. సెకండ్ హాఫ్ నిజంగానే కొన్ని చోట్ల ఫన్ తో సాగింది. ఆ ఫన్ ను కూడా దర్శకుడు సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయాడు. ఎక్కడా బోర్ లేకుండా వున్న ఈ ధూమ్ దామ్ పెళ్లిలో యాడ్ అయ్యే ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి.  వినోదాన్ని  కోరుకునే ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 2.75/5