బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (11:52 IST)

"వేట్టయన్" కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలని కోరిన రజనీకాంత్

vettaiyan
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "వేట్టయన్". టేజీ జ్ఞానవేల్. అమితాబ్, ఫహద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, దుషార విజయన్ తదితరులు నటించారు. ఈ నెల పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా స్టోరీ గురించి రజనీకాంత్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
'టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వచ్చిన "జైభీమ్" సినిమా నాకెంతో నచ్చింది. కానీ, గతంలో జ్ఞానవేల్‌తో ఎప్పుడూ మాట్లాడే అవకాశం రాలేదు. 'వేట్టయన్' కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే, ఈ సినిమా తీయడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. అందుకే కథలో కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయాలని కోరాను. 10 రోజుల సమయం అడిగాడు. 'కమర్షియల్‌ సినిమాగా మారుస్తాను. 
 
కానీ, నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, లోకేశ్‌ కనకరాజ్‌ల సినిమాగా మార్చలేను. నా శైలిలో ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను మారుస్తాను' అని జ్ఞానవేల్‌ చెప్పాడు. 'నాకు అదే కావాలి.. లేదంటే లోకేశ్‌, దిలీప్‌ల దగ్గరకే వెళ్లేవాడిని కదా' అని చెప్పా. 10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను" అని రజనీకాంత్‌ తెలిపారు. ఈ సినిమాకు అనిరుధ్‌ మాత్రమే సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్‌ పట్టుపట్టినట్లు రజనీ గుర్తుచేసుకున్నారు.
 
తమిళనాడులో గతంలో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంతో దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది రజనీకాంత్‌కు 170వ చిత్రం. ఆయన ఇందులో రిటైర్డ్‌ పోలీసు అధికారిగా నటించారు.