ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (15:16 IST)

''రాజు గారి గది-2''లో తాజా లుక్: పంచెకట్టులో టీచర్‌గా సమంత

నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు చెందిన తాజా లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో గ్లామర్ తారగా వెలుగొందిన సమంత టీచర్‌గా మారిపోయింది

నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు చెందిన తాజా లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో గ్లామర్ తారగా వెలుగొందిన సమంత టీచర్‌గా మారిపోయింది. చేత్తో బెత్తం పట్టుకొని చిన్న పిల్లలకు పాఠాలు చెప్పేందుకు సిద్ధమైంది.  రాజుగారి గది-2లో సమంత దెయ్యంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా లుక్‌లో పంచెకట్టులో సమంత పిల్లలకు పాఠాలు చెప్తోంది. 
 
ఈ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటూ, ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇక ఈ మూవీలో సమంత దెయ్యంగా కనిపిస్తుండగా, నాగార్జున మెంటలిస్ట్‌గా కనిపించనున్నారు. సీరత్‌ కపూర్‌, అశ్విన్‌, శకలక శంకర్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. పీవీపీ సంస్థ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి ఓంకార్‌ దర్శకత్వం వహించగా, థమన్‌ సంగీతాన్ని అందించాడు.
 
బ్లాక్ బస్టర్ సినిమా "రాజుగారి గది"కి సీక్వెల్‌గా రూపొందిన "రాజుగారి గది-2" సెన్సార్ పూర్తయ్యింది. హైక్వాలిటీ విఎఫెక్స్, ఆద్యంతం ఆకట్టుకొనే కథాంశం సినిమాకి కీలకమైన అంశాలని దర్శకనిర్మాతలు తెలిపారు.