బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (15:08 IST)

హనీప్రీత్‌కు అసూయ.. గుర్మీత్ నన్ను పెళ్లి చేసుకుంటే.. సవతి అవుతానని భయపడేది: రాఖీ

బాలీవుడ్ సెక్సీబాంబ్ రాఖీ సావంత్ తాజాగా డేరా బాబా బయోపిక్‌లో హనీప్రీత్ సింగ్ పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న రాఖీ సావంత్ అత్యాచారాల కేసుల్లో చిప్పకూడు తింటున

బాలీవుడ్ సెక్సీబాంబ్ రాఖీ సావంత్ తాజాగా డేరా బాబా బయోపిక్‌లో హనీప్రీత్ సింగ్ పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న రాఖీ సావంత్ అత్యాచారాల కేసుల్లో చిప్పకూడు తింటున్న డేరా బాబా గురించి కీలక విషయాలు బయటపెట్టింది. గుర్మీత్ సింగ్ బాబాతో తనకు దగ్గరి సంబంధాలున్నాయని రాఖీ చెప్పుకొచ్చింది. బాబా సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్ గురించి తనకంటే బాగా ఎవ్వరికీ తెలియదని తెలిపింది. 
 
ఓసారి గుర్మీత్ సింగ్ బాబా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆశ్రమానికి రావాలని పిలుపు రావడంతో అక్కడికి వెళ్లానని.. అది హనీప్రీత్ సింగ్‌కు ఏ మాత్రలం నచ్చలేదని వెల్లడించింది. గుర్మీత్ సింగ్ బాబా తనను పెళ్లి చేసుకుంటాడనే భయంతో.. ఆమెకు సవతిని అవుతాననే భయంతో హనీప్రీత్ సింగ్ గుర్మీత్‌ను కలవనిచ్చేది కాదని రాఖీ చెప్పుకొచ్చింది. ఆమెకు అసూయ ఎక్కువని చెప్పింది.
 
జైలుకెళ్లి గుర్మీత్ సింగ్ బాబాను కలవాలనుకున్నానని.. అయితే ఆపై తన మైండ్‌ను మార్చుకున్నానని చెప్పుకొచ్చింది. హనీ ప్రీత్ సింగ్ తననే కాదు.. ఆశ్రమానికి వచ్చే అందమైన అమ్మాయిలను కలవనిచ్చేది కాదని చెప్పింది. అలా అందమైన అమ్మాయిలను బాబా కలిస్తే తనను పక్కనబెడతాడనే భయంతో ఆమె అలా చేసేదని రాఖీ చెప్పుకొచ్చింది.
 
అయితే డేరా బాబా ఆడవాళ్ల జీవితాల్లో ఇలా ఆడుకుంటాడని, మగవాళ్లను నంపుసకులుగా చేస్తాడని అనుకోలేదని రాఖీ తెలిపింది. గతంలో గుర్మీత్ సింగ్ సెక్రటరీ అరోరా పిలుపు మేరకు బాబాను కలిశానని.. అప్పుడు గుర్మీత్ గదిలో వయాగ్రా పొట్లాలు వుండటాన్ని గమనించానని రాఖీ వెల్లడించింది.