శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (21:19 IST)

భార్యాభర్తలైన రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ.. ఫోటోలు వైరల్

Rakul preet singh
Rakul preet singh
బాలీవుడ్ తారలు రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఇప్పుడు భార్యాభర్తలు. వారు తమ వివాహ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లోకి అధికారికంగా షేర్ చేశారు. వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. పెళ్లి కోసం రకుల్ అద్భుతమైన వజ్రాలు పొదిగిన పింక్-పీచ్ లెహంగా ధరించింది. జాకీ ఒక భారీ నెక్లెస్‌తో కూడిన క్రీమ్-గోల్డెన్ షేర్వానీని ధరించాడు. ఈ జంటకు సమంతా రూత్ ప్రభు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుండి శుభాకాంక్షలు వచ్చాయి.
 
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని వివాహం ఐటీసీ గ్రాండ్ సౌత్ గోవా హోటల్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే హాజరయ్యారు. వీరిలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా, అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా తదితరులు ఉన్నారు. కాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యాయి.
Rakul preet singh
Rakul preet singh
 
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2 లో కనిపించనుంది. ఈ చిత్రంలో బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ మొదటి భాగం 1996లో విడుదలైంది. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకునే వృద్ధ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో కమల్ హాసన్ నటించారు.