1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (21:08 IST)

ఫిబ్రవరి 21న గోవాలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ పెళ్లి

rakul preeth singh
బాలీవుడ్‌లో అత్యంత ఇష్టపడే జంటలలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమపక్షులు పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఫిబ్రవరి 19-20 తేదీలలో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.
 
ఈ జంట పెళ్లి తేదీని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని బిటౌన్ వర్గాల సమాచారం. డిజైనర్ల నుండి ఫోటోగ్రాఫర్ల వరకు ఎవరికీ తేదీ గురించి సమాచారం లేదు. గోవాలో పెళ్లి జరగడంతో అందరికీ బల్క్ డేట్స్ ఇచ్చారు. రకుల్ వివాహ దుస్తులను ఏస్ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేస్తున్నారు.