సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (13:20 IST)

ప్రధాని మోడీ సమక్షంలో ఒక్కటైన జంట... వధూవరులకు ఆశీర్వాదం

bhagya gopi
ప్రధాని నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ జంట ఒక్కటైంది. ఆ వధువు ఎవరో కాదు.. సినీ నటుడు సురేష్ గోపి కుమార్తె భాగ్య గోపి. బుధవారం జరిగిన వివాహ మహోత్సవ ఘట్టంలో ఆమె ప్రధాని మోడీ సమక్షంలో వివాహం చేసుకున్నారు. 
 
అలాగే, ప్రధాని మోడీ సైతం బుధవారం ఉదయం ప్రఖ్యాత గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. శ్రీకృష్ణ భగవాన్‌ను దర్శించుకున్న తర్వాత ఆయన ఆలయ ప్రాంగణంలో జరిగిన కేరళ నటుడు సురేష్ గోపీ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పూల దండలు అందించి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సినీ ప్రముఖుల్లో మమ్మూట్టి, మోహన్ లాల్, దిలీప్, జయరామ్, ఖుష్బూ, డైరెక్టర్ షాజీ కైలాశ్ తదితరులు ఉన్నారు. 
 
అలాగే, గురువాయూర్ ఆలయంలో ఒక్కటైన మరో 30 జంటలను కూడా ప్రధాని మోడీ ఆశీర్వదించారు. ప్రధాని మోడీ రాకతో గురువాయూర్ ఆలయంలో భక్తులతో పాటు స్థానికులు భారీ సంఖ్యలో పోటెత్తారు. అనూహ్యంగా తరలివచ్చిన భక్తులను నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. స్వామి వారిని దర్శించుకున్న మోడీ... నూతన వధూవరులను ఆశీర్వదించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు.