80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం
టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆమెకి ఫిట్‌నెస్ పైన మక్కువ ఎక్కువ. ప్రతిరోజూ తన సొంత వ్యాయామశాలలో వ్యాయామం చేసిన తర్వాత కాని మిగిలిన దినచర్య ప్రారంభిస్తుంటారు. ఇటీవల ఆమె తన జిమ్‌లో 80 కిలోల బ్యాక్‌లిఫ్ట్‌కు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమెకి వెన్నునొప్పి వచ్చింది. తన వీపు విపరీతంగా నొప్పిపెడుతుండటంతో వర్కవుట్‌ను ఆపేసింది.
కొన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకున్న తర్వాత తను నటిస్తున్న కొత్త హిందీ చిత్రం కోసం షూటింగు కోసం వెళ్లింది. కానీ గాయం తీవ్రమై విపరీతంగా బాధపెట్టడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెకి అక్కడ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు.
కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. తన ఆరోగ్యం పట్ల సందేశాలు పంపిన అభిమానులకు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది.