సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 అక్టోబరు 2024 (15:47 IST)

నటీనటులను డ్రగ్స్‌లో కేటీఆర్ ఇరికించారు, వాళ్ల ఫోన్లు ట్యాప్: నట్టి కుమార్

Nattikumar
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదని నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. సినిమా నటీనటుల్లో కొంతమందిని డ్రగ్స్ కేసుల్లో కేటీఆర్ ఇరికించారని ఆయన ఆరోపించారు. వాళ్లను అలా ఇరికించి అందరినీ బజారుకీడ్చారనీ, ఆ తర్వాత వారికి క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాల్సి వుందన్నారు.
 
టాలీవుడ్ సెలబ్రిటీల్లోని కొంతమంది ఫోన్లను కేటీఆర్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. తనపై ఎంక్వైరీలు వేసుకుని తనకేమీ తెలియదని చెప్పినంత మాత్రాన నమ్మే పరిస్థితి లేదన్నారు. అసలు కేటీఆర్ గారికి సినిమా వాళ్లతో పరిచయం ఎలా వుంది అంటూ ప్రశ్నించారు.