బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (22:04 IST)

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

nagachaitanya
రాజకీయాలలో నీచమైన మాటలు, వ్యక్తిగత దూషణలు కొత్త కాదు. ఆంధ్రా రాజకీయాల్లో ముఖ్యంగా నారా భువనేశ్వరి లేదా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి రాజకీయ నాయకులు ఎంత దిగజారి వ్యాఖ్యలు చేశారో చూశాం. 
 
ప్రస్తుతం ఇలాంటి ఘటనే తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది. మంత్రి కొండా సురేఖ తన రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్, సమంత, నాగార్జునలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియలో, కేవలం అక్కినేని కుటుంబం లేదా సమంత మాత్రమే ప్రభావితం కావట్లేదు.
 
తాజాగా నాగ చైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న శోభితా ధూళిపాళ కూడా ఈ వ్యాఖ్యలతో కలత చెందింది. ఆమె నాగ చైతన్యతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ ఆమెను నిరాశలో ముంచేసింది. 
 
ఇంకా ఇటీవలే జరిగిన నిశ్ఛితార్థాన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితి తలెత్తింది. తన మాజీ భార్య సమంతపై, కుటుంబంపై వచ్చిన కామెంట్స్‌ నుంచి చైతూ అంత ఈజీగా బయటపడలేరని టాక్ వస్తోంది. దీంతో శోభిత డల్ అయిపోయిందని సమాచారం.