గురువారం, 14 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (17:04 IST)

తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నితమనస్కులు : సాయి ధరమ్ తేజ్

Saidharam tej
సినీ నటులు తెరమీద మినహా జీవితంలో నటించలేని సున్నిత మనస్కులు అంటూ హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. సమంత విడాకుల అంశంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన విమర్శలపై హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సర్వసాధారణమైపోయాయిని వాపోయారు. 
 
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ బుధవారం రోజున రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఒక ప్రఖ్యాత కథానాయకి పేరును ఉపయోగించడం, ఓ ప్రఖ్యాత సినిమా కుటుంబ వ్యహారాలను ఉటంకించి, మీడియా ముఖంగా మాట్లాడడం వారికి రాజకీయంగా ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియదు కానీ.. ఓ మహిళ ఆత్మాభిమానం, ఓ కుటుంబం పరువు, ప్రతిష్టలకు తీరని నష్టం, అన్యాయం జరిగిందన్నారు. 
 
గౌరవనీయులైన మంత్రివర్యులకు, రాజకీయ విమర్శలకు ఏ మాత్రం సంబంధం లేని, తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నితమనస్కులైన.. సినీనటులను బలిచేయవద్దని, జరిగిన తొందరపాటు చర్యను, విజ్ఞులైనమీరు పెద్దమనసుతో సరిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నట్టు, భవిషత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని వినమ్రంగా విన్నవించుకుంటున్నాను అని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు.