సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

హీరో రామ్ చరణ్ వల్ల వాయిదా పడిన శంకర్ సినిమా షూటింగ్

హీరో రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో "ఆర్‌సి-15" పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించేలా ప్లాన్ చేశారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ ఇపుడు వాయిదాపడింది.
 
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో కొంత షూటింగ్ జరపాలని షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే షూటింగ్ ఈ నెల 25వ తేదీ వరకు జరగాల్సివుంది. 
 
కానీ, ఇపుడు ప్లాన్ రివర్స్ అయింది. అనుకున్నట్టుగా ఈ షెడ్యూల్‌ను ఇక్కడ షూట్ చేయడం లేదు. ఈ షెడ్యూల్‌ను ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారణంగా రామ్ చరణ్‌గా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన తన సతీమణితో కలిసి ముంబైలో ఉన్నారు. ఈ కారణంగానే ఈ షూటింగ్ రీషెడ్యూల్ చేసినట్టు తెలుస్తోంది.