సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 జులై 2017 (09:57 IST)

చంద్రబాబు... నవ్వులేని నాయకుడు : జగన్.. సన్ ఇన్ ఇనుము... ఈ మాటలు ఎవరన్నారు?

నిన్నామొన్నటివరకు కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వచ్చిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇపుడు రాజకీయ నేతలను కూడా వదిలిపెట్టలేదు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ర

నిన్నామొన్నటివరకు కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వచ్చిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇపుడు రాజకీయ నేతలను కూడా వదిలిపెట్టలేదు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నేతల గురించి తనకున్న ఫీలింగ్స్‌ను ఆర్జీవీ తాజాగా బయటపెట్టాడు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వు లేని నాయకుడితో పోల్చితే.. విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని సన్ ఇన్ ఇనుము(ఐరన్)తోనూ, హీరో పవన్ కళ్యాణ్‌ను ఓ రాజకీయ నేతగా చెపుతూ... వెయిట్ అండ్ వాచ్‌గా పేర్కొన్నాడు.
 
అలాగే, మిగిలిన సెలబ్రిటీల గురించి ఏమన్నారో ఓసారి పరిశీలిద్ధాం. రాజమౌళి: మెస్సయ్య ఆఫ్ ఫిల్మ్స్,  ప్రభాస్: సెక్సీయెస్ట్స్ పవర్, జూనియర్ ఎన్టీఆర్: రీ ఫిటింగ్ సీనియర్ ఎన్టీఆర్, నాగార్జున: లవ్, చిరంజీవి: స్టార్ మెగా, బన్నీ: డేంజరస్ రాబిట్, రాంచరణ్ తేజ్: ధీరుడైన మగాడు, నాగబాబు: లవ్ లీ బ్రదర్ అంటూ టకటకా సమాధానమిచ్చేశాడు.