బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 26 డిశెంబరు 2017 (14:10 IST)

రానా... రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉందా? అడిగింది ఎవరు?

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో ఎంతోమంది ప్రముఖులు కలిశారు. అందులో పవన్ కళ్యాణ్‌, రానా కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. కేవలం సెల్ఫీతో రానా సరిపెట్టుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్‌ మాత్రం ఏకంగా రాజకీయాల్లోకి రానాను లాగేందుకు ప్రయత్నించారనే టాక్ విన

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో ఎంతోమంది ప్రముఖులు కలిశారు. అందులో పవన్ కళ్యాణ్‌, రానా కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. కేవలం సెల్ఫీతో రానా సరిపెట్టుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్‌ మాత్రం ఏకంగా రాజకీయాల్లోకి రానాను లాగేందుకు ప్రయత్నించారనే టాక్ వినబడుతోంది. పవన్ కనిపించిన వెంటనే అన్నా నమస్తే... అంటూ ఆప్యాయంగా కరచాలనం చేసిన రానా ఆ తరువాత సెల్ఫీ ప్లీజ్ అంటూ కోరాడు. దాంతో పవన్ కళ్యాణ్ అలాగే అంటూ తలూపాడు. సెల్ఫీ తీసుకున్న తరువాత రానాతో కాసేపు ముచ్చటించారు పవన్ కళ్యాణ్‌.
 
రాజకీయాలపై నీ అభిప్రాయమేంటి రానా అని అడిగారు పవన్ కళ్యాణ్‌. కొద్దిసేపు రానాకు ఏం అర్థం కాలేదు. నేను ఇప్పుడు సినిమాల్లోనే బిజీగా ఉన్నాను అన్నా. రాజకీయాల గురించి ఏమీ ఆలోచించలేదని చెప్పాడు. సరేలే.. సరదాగా అడిగానంటూ పవన్ కళ్యాణ్‌ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి రానా రాజకీయాల్లో ఇష్టం వుందని చెబితే జనసేనలోకి రమ్మని ఆహ్వానించేవారేమోనని చెప్పుకుంటున్నారు.