గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2024 (13:51 IST)

Kazakhstan: కజకిస్తాన్‌‌లో కూలిన విమానం.. 72మంది మృతి - పక్షుల గుంపును ఢీకొనడంతో? (video)

Plane Crash
Plane Crash
కజకిస్తాన్‌లోని అక్టౌ నగరం సమీపంలో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక ప్రయాణీకుల విమానం బుధవారం  కూలిపోయింది. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా, ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని సమాచారం. అజర్‌బైజాన్‌లోని బాకు నుండి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తున్న ఈ విమానం గ్రోజ్నీలో భారీ పొగమంచు కారణంగా అక్టౌకు మళ్లించబడిందని కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యన్ వార్తా సంస్థలు నివేదించాయి.
 
67 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయే ముందు విమానాశ్రయం మీదుగా అనేకసార్లు ప్రదక్షిణలు చేసింది. విమానం పక్షుల గుంపును ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. 
 
పక్షుల గుంపును ఢీకొనడం నియంత్రణ కోల్పోవడంతో విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
కజకిస్తాన్ అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ 52 మంది రక్షకులు, 11 పరికరాలను వెంటనే ప్రమాద స్థలానికి పంపి, సహాయక చర్యలను చేపట్టింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సంఘటన నుండి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారని కజకిస్తాన్ ఆరోగ్య మంత్రి ధృవీకరించారు.  కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ, ఇతర అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.