గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (09:56 IST)

రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్ నిర్మాతలుగా ప్రియదర్శి హీరోగా చిత్రం

Rana Daggubati,  Jhanvi Narang, Priyadarshi
Rana Daggubati, Jhanvi Narang, Priyadarshi
ప్రముఖ నిర్మాతల వారసులు కొత్త వారితో సినిమాలు తీస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) ప్రొడక్షన్ నెం. 9ని అనౌన్స్ చేశారు. తన కెరీర్‌లో వరుసవిజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని  SVACLLP & రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సగర్వంగా ప్రెజెంట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డును అందుకున్న జాన్వీ నారంగ్‌నిర్మాతగా మేడిన్ ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ చిత్రంతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
బలగంతో పెద్ద విజయాన్ని అందుకున్న ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు. సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీ తెలుగు ఒరిజినల్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ప్రియదర్శికి వండర్ ఫుల్ ఫిల్మ్స్ లైనప్ లో వున్నాయి.  
 
ఈ కొత్త చిత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన రొమాంటిక్  స్టొరీ, ఇందులో ప్రియదర్శి డిఫరెంట్ హిలేరియస్ పాత్రలో కనిపించనున్నారు. “థ్రిల్-యు ప్రాప్తిరస్తు” అనే క్యాచీది ట్యాగ్‌లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమా ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోందో తెలియజేస్తుంది.
 
జాన్వీ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ మార్గదర్శకత్వంలో కొన్ని కంటెంట్-రిచ్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తొలి ప్రయత్నంలో వస్తున్న ఈ  చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకునే అవుట్-అండ్-అవుట్-ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. నిర్మాణంలో అపార అనుభవం, స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో సిద్ధహస్తుడు రానా దగ్గుబాటి లాంటి స్టార్‌ సపోర్ట్ చేయడం జాన్వీ గుడ్ లక్.
 
ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ చిత్రం జనవరి, 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తారాగణం, టెక్నికల్ టీం వివరాలతో పాటు చిత్రం టైటిల్ త్వరలో రివిల్ చేయనున్నారు మేకర్స్.