హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించ బోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'ఓం భీమ్ బుష్' మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ రావడం ఎలా అనిపించింది ?
చాలా ఆనందంగా వుంది. ఇందులో చాలా కొత్త పాయింట్, ఐడియా చెప్పడం జరిగింది. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్. చాలా సార్లు కొత్త పాయింట్ దొరికినప్పుడు ఒకటే జోనర్ కి కట్టుబడి ఉండిపోతాం. అలా ఒకటే జోనర్ కి పరిమితం కాకుండా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తూ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా చేశాం. ఖచ్చితంగా అందరూ ఎంటర్ టైన్ అవుతారు. మేము చెప్పే కొత్త పాయింట్ రివిల్ అయినపుడు ఆడియన్స్ తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. ఆ సమయానికి కథలో మా పాత్రల పరిస్థితి ఎలా వున్నప్పటికీ సినిమా చూస్తున్న ఆడియన్స్ మాత్రం హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు.
ఈ కథ అనుకున్నప్పుడే 'ఓం భీమ్ బుష్' టైటిల్ ఫిక్స్ చేశారా ?
రెండు, మూడు టైటిల్స్ అనుకున్నాం. అందులో ఒకటి ఇంగ్లీష్ లో వస్తుంది. అయితే నేను మాత్రం 'ఓం భీమ్ బుష్' వైపే వున్నాను. ఇది చాలా క్యాచి టైటిల్. చిన్నప్పుడు మనం మ్యాజిక్కులు చేయడానికి వాడే మంత్రం( నవ్వుతూ).నిర్మాత వంశీ గారు ఫస్ట్ కట్ చూసి 'ఓం భీమ్ బుష్' పేరే ఫిక్స్ అయిపోదాం అన్నారు. అలా 'ఓం భీమ్ బుష్'నే ఫైనల్ చేశాం. టైటిల్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టైటిల్స్ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను. సినిమాని ముందు ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్ళేది అదే కదా.
కథలో కొత్త పాయింట్ ఉన్నప్పటికీ నటన, డైలాగ్స్ విషయంలో ఎలా ఉండబోతుంది ?
పాయింట్ పరంగా చూసుకుంటే 'ఓం భీమ్ బుష్'లాంటి పాయింట్ ఇప్పటివరకూ రాలేదు. ఇందులో మిస్టరీ, థ్రిల్, ఇలా అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇవన్నీ ఎలా వర్క్ అవుట్ అవుతాయో ప్రేక్షలులు చూస్తున్నపుడు తెలుస్తుంది. అయితే ఎంటర్ టైన్మెంట్ పక్కాగా వుంటుంది. మిగతా ఏదున్నా అది బోనస్ అని ఆశిస్తున్నాను. ప్రేక్షకులు కూడా ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఇంకొకటి బావుందని అంటారు. అది ఏమిటనేది సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది.
సామజవరగమన తర్వాత మార్కెట్ పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటారా?
నేను అలా ఎప్పుడూ ప్లాన్ చేయను. మార్కెట్ పెరగాలనే జోన్ లోకి వెళితే ఇంక దానిపైనే ద్రుష్టి వుండిపోతుంది. నేను ఎప్పుడూ కూడా నిర్మాత మన మీద పెట్టిన పెట్టుబడి పోకూడదనే విషయంపైనే ద్రుష్టి పెడతాను.
సామజవరగమన సెట్ చేసిన అంచనాలని 'ఓం భీమ్ బుష్' అందుకుంటుందా?
ఈ సినిమా వరకూ 'ఓం భీమ్ బుష్' మీద పెట్టిన పెట్టుబడికి మూడు, నాలుగు రెట్ల లాభం రావడం చాలా తృప్తిని ఇచ్చింది. దీనికి సామజవరగమన విజయం, 'ఓం భీమ్ బుష్' టీజర్, ట్రైలర్, యూవీ బ్యానర్ హెల్ప్ అయ్యింది. మంచి బ్యానర్ తో సినిమాలు చేయడం వారు అన్నీ విషయాల్లో శ్రద్ద తీసుకుంటారు. దాంతో నాపై కూడా ఒత్తిడి తగ్గుతుంది.
'బ్రోచేవారు' తర్వాత కామెడీ విషయంలో ఒక ప్రత్యేకమైన కథని ఎంచుకోవాలనే ఒత్తిడి ఏమైనా పెరిగిందా ?
నిజానికి మేము అంత ఒత్తిడి తీసుకోలేదు. మేము ముగ్గురం రెగ్యులర్ గా కలవడం వల్ల ఏమోకానీ పెద్ద మార్పుగా ఏమీ అనిపించలేదు. సరదాగా, ముగ్గురు ఫ్రెండ్స్ మాట్లాడుకునేలా, అంత సహజంగా ఈ సినిమా చేశాం. సింగిల్ లైనర్స్ హిలేరియస్ గా వుంటాయి.
సెకండ్ హాఫ్ లో హిలేరియస్ బ్లాక్స్ ఉంటాయని విన్నాం ?
ఫస్ట్ హాఫ్ లో మూడు బ్లాకులు, సెకండ్ హాఫ్ లో రెండు బ్లాకులు ఎంటర్ టైన్మెంట్ పరంగా హిలేరియస్ గా బ్లాస్ట్ అవుతాయి. ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూప్ గా చూస్తే ఇంకా అదిరిపోతుంది.
కథలో మీ ముగ్గిరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి ?
మేము సైంటిస్టులు కావాలని పీహెచ్డీ చేస్తాం. మమ్మల్ని ఎలాగైనా కాలేజీ నుంచి పంపించేయాలని స్కెచ్ వేసి పంపించేస్తారు. తర్వాత భైరవపురం అనే వూరికి వస్తాం. ఆ వూర్లో ఎదురయ్యే పరిస్థితులు, పాత్రలు హిలేరియస్ గా వుంటాయి. కాలేజీలో వున్నపుడు ఎలా అయితే కింగ్స్ లా వుండేవాళ్లమో,, ఇక్కడ కూడా అలానే కింగ్స్ లా మారుతాం. ఎక్కడున్నా కింగ్ లా బ్రతికేసే పాత్రలివి. ఈ క్రమంలో నిధిని పట్టుకునే టాస్క్ వస్తుంది. అసలు నిధి ఉందా లేదా .. మా ప్రయత్నాలు ఎలా జరిగాయనేది మిగతా కథ. చాలా సరదాగా హిలేరియస్ గా సాగే సినిమా ఇది.
దర్శకుడు శ్రీహర్ష విజన్ ని ఎలా అంచనా వేశారు ?
శ్రీహర్ష చెప్పిన కథకు కొంచెం కలర్ ఫుల్ గా వెళితే బావుంటుందనిపించింది. రాజ్ తోట డీవోపీ. ఆయనతో ఆరు సినిమాలు చేశాను. వాళ్ళిద్దరికి కూడా మంచి సింక్. అలాగే సంగీతం సన్నీ. తన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఒక అద్భుతమైన ప్రొడక్షన్ హౌస్. మంచి టీం కుదరడంతో సినిమా టెక్నికల్ గా బావుటుందని నమ్మకం. శ్రీకాంత్ ఆర్ట్ డైరెక్టర్. చాలా అద్భుతంగా చేశాడు. తను పెద్ద టెక్నిషియన్ అవుతాడు. ఇంతమంచి టీం రావడంతో దర్శకుడు విజన్ కూడా క్లియర్ గా అర్ధమైయింది.
దర్శకుడు చాలా మంది హీరోయిన్స్ వున్నారని చెప్పారు.. ట్రైలర్ లో ఒక్క హీరోయినే కనిపిస్తుంది. మిగతా వారిని దాచారా ?
దాయలేదండి. ప్రియావడ్లమాని ఓ పాటలో కనిపిస్తారు. ట్రైలర్ లో ఆయేషా ఖాన్ కనిపించారు. నిజానికి సినిమాలో ఎటుచూసినా నేను, ప్రియదర్శి, రాహులే కనిపిస్తాం. మిగతా పాత్రలు పరిమితంగా సింపుల్ గానే వుంటాయి. ఈ కథ పరంగా హీరోయిన్ ప్రాధాన్యత వుంటుంది.
దర్శి, రాహుల్ తో మళ్ళీ కలసి వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
మేము మంచి ఫ్రెండ్స్. ఈ సినిమా షూటింగ్ పూణేలో చేశాం. అక్కడ లొకేషన్ కి దగ్గర లోని ఓ పొలంలో వసతి ఏర్పాటు చేసుకొని ముగ్గురం వున్నాం. దాదాపు పదిహేనురోజులు అక్కడ వున్నాం. ఈ సినిమా షూటింగ్ ని చాలా ఆస్వాదించాం.
సామజవరగమన లా ఈ సినిమాకి పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారా ?
సమయం వుంది కాబట్టి ప్రిమియర్స్ వేయాలనే అయితే ఆలోచన వుంది.
కొత్త ప్రాజెక్ట్స్ ?
శ్వాగ్ దాదాపు పూర్తయింది. దీంతో పాటు ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా, కోన గారితో ఒక సినిమా చేస్తున్నాను.