గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (17:40 IST)

అట్టహాసంగా రణదీప్ హుడా- లిన్ లైష్రామ్‌ పెళ్లి

Randeep Hooda
Randeep Hooda
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా పెళ్లి చేసుకున్నారు. మణిపురికి చెందిన నటి లిన్ లైష్రామ్‌తో అతని వివాహం రాత్రి చాలా గ్రాండ్‌గా జరిగింది. రణదీప్ హుడా, లిన్ లైష్రామ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ఓ ఇంటివాడు అయ్యాడు. లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు. మణిపర్‌కి చెందిన నటి, మోడల్‌ లిన్‌ లైష్రామ్‌ను రణదీప్‌ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా జరగడం విశేషం. 
 
మణపర్ రాజధాని ఇంఫాల్‌లో వారు తమ సంప్రదాయ పద్ధతిలో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా రణదీప్ హుడా తన పెళ్లిని ప్రకటించి, సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలను పంచుకున్నాడు. రణదీప్ తెల్లటి దుస్తుల్లో కనిపించాడు. 
 
అతను తెల్ల కుర్తా, ధోతీలో రాయల్‌గా కనిపిస్తున్నాడు. ఆయనే కాదు వారి బంధువులు కూడా తెల్లటి దుస్తుల్లో మెరిసిపోయారు. లిన్ లుక్ ఆకర్షణీయంగా ఉంది. 
 
మణిపర్ సంప్రదాయాన్ని తలపించే పెళ్లి దుస్తులను ఆమె ధరించడం విశేషం. నలుపు రంగు బ్లౌజ్ ధరించిన తెలుపు, గులాబీ రంగు చీర. ఆమె బంగారు ఆభరణాలు ధరించి చాలా అందంగా ఉంది.