ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (14:01 IST)

''రంగస్థలం'' రూ.175కోట్ల గ్రాస్‌తో నెం.1 స్థానానికి.. సీక్వెల్‌కు నో చెప్పిన సమంత

రంగస్థలం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలో రామ్ చరణ్ సరసన సమంత నటించగా.. ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రోహిణి, నరేశ్, జబర్ధస్త్ మహేశ్, అనసూయ తదితరుల

రంగస్థలం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలో రామ్ చరణ్ సరసన సమంత నటించగా.. ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రోహిణి, నరేశ్, జబర్ధస్త్ మహేశ్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో అదరగొట్టేశారు.
 
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ''రంగస్థలం'' బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రంగస్థలం ఇప్పటివరకు రూ.175కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. దీంతో బాహుబలియేతర సినిమాలలో టాప్ వన్‌ గ్రాసర్‌గా ''రంగస్థలం'' నిలిచింది.  
 
ఇదిలా ఉంటే.. రంగస్థలం సూపర్ హిట్ టాక్ నేపథ్యంలో దీనికి సీక్వెల్ వస్తుందని, రంగస్థలం 2 పేరుతో ఆ సినిమాను రూపొందిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అంతేగాకుండా రంగస్థలం సీక్వెల్‌లో చెర్రీకి చెవుడు కూడా వుండదని సమాచారం. అయితే రంగస్థలం సీక్వెల్‌లో హీరోయిన్ ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. 
 
ఈ అంశంపై సమంత స్పందించింది. తను మళ్లీ రంగస్థలం కాన్సెప్ట్‌తో నటించనని సమంత స్పష్టం చేసింది. ఈ సినిమాను రీమేక్ చేసినా, సీక్వెల్ వచ్చినా అందులో నటించే ప్రసక్తే లేదని సమంత స్పష్టం చేసింది.