ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (16:01 IST)

'రంగమ్మత్త విందు భోజనం.. రంగస్థలం కనకవర్షంతో లాభాల పంట' (Video)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంత కాంబినేషన్‌లో కె. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "రంగస్థలం". మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రతి ప్రాంతంలోనూ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుప

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంత కాంబినేషన్‌లో కె. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "రంగస్థలం". మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రతి ప్రాంతంలోనూ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్‌ను సాధించి అందరిచే ఔరా! అనిపించింది. వారం రోజులు పూర్తయ్యేనాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల గ్రాస్‌ను.. రూ.81 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ను రాబట్టినట్టు సమాచారం.
 
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను రూ.80 కోట్లకు విక్రయించారు. వారం రోజుల వసూళ్లు ఈ మార్క్ దాటిపోవడంతో, ఇకపై వచ్చేవన్నీ లాభాలేనని అంటున్నారు. దగ్గర్లో చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో భారీ లాభాలు ఖాయమని చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే, టాలీవుడ్‌లో ఆల్ టైమ్ గ్రాస్ కలెక్షన్ల లిస్టులో ఉన్న 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'అత్తారింటికి దారేది', 'జై లవకుశ'లను అధిగమించడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  
 
మరోవైపు, రంగస్థలం సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా, చరణ్, సమంతలతో పాటు రంగమ్మత్తగా నటించిన అనసూయకి కూడా ఈ సినిమాలో చాలా మంచి పాత్ర లభించింది. అనసూయకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే రంగస్థలం అసిస్టెంట్ డిజైనర్ గౌరీ నాయుడు 'రంగమ్మత్త విందు భోజనం' అంటూ ఓ పిక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 'రంగమ్మత్త విందు భోజనం.. మా రంగస్థలం గ్రామస్థులు మరియు మా ప్రెసిడెంట్ గారి సన్నిహితులు' అంటూ పిక్‌ని పోస్ట్ చేసింది. దీనికి అనసూయ 'సచ్ లవ్‌లీ టైమ్' అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చింది.
 
మరోవైపు, రంగస్థలం చిత్రం కలెక్షన్లు "బాహుబలి, బాహుబలి 2" చిత్రాలు మినహా మిగిలిన చిత్రాల రికార్డులను తిరగరాసేదిశగా సాగుతోంది. ఇప్పటికే అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా దేశీయంగానే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తోంది. కేవలం విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా వంద కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్షన్ చేసిన రంగస్థలం... ఇపుడు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళుతోంది. 
 
'రంగస్థలం' సినిమాతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న చెర్రీ తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం పొందుతున్నాడు. అదేసమయంలో తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించారు. 'చెయ్యి చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్ ఆడించేస్తా' అంటారు మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాలో. ఇపుడు చెర్రీ కూడా అదే స్వభావంతో ఓ చిత్రంలో కనిపించనున్నాడు. 
 
చెర్రీ, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఎవరైనా తన ఫ్యామిలీ జోలికి వస్తే రఫ్ఫాడించేసే స్వభామట చెర్రీది. ఈ సినిమాలో చెర్రీకి సోదరులుగా ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. రంగస్థలంలో క్యారెక్టర్‌కు పూర్తి డిఫరెంట్‌గా ఉంటుందట బోయపాటి సినిమాలో చెర్రీ క్యారెక్టర్. మరి ఎలా ఉంటుందో వేచిచూద్ధాం.