శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (12:22 IST)

చెర్రీ, సమంత కిస్ సీన్ 45 నిమిషాల్లోనే తీసేశాం.. పదిలక్షలు బెట్ కట్టారు?

రంగస్థలం సినిమాలోని రామ్ చరణ్, సమంత కెమిస్ట్రీ గురించి ఆ సినీ దర్శకుడు సుకుమార్ ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సమంత, చెర్రీ లవ్ ట్రాక్ పక్కాగా వచ్చిందని.. ఓ కిస్ సీన్ తీసేటప్పుడు పది లక్షల

రంగస్థలం సినిమాలోని రామ్ చరణ్, సమంత కెమిస్ట్రీ గురించి ఆ సినీ దర్శకుడు సుకుమార్ ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సమంత, చెర్రీ లవ్ ట్రాక్ పక్కాగా వచ్చిందని.. ఓ కిస్ సీన్ తీసేటప్పుడు పది లక్షల రూపాయలు పందెం కట్టారని సురకుమార్ చెప్పారు. సినిమా మొత్తం.. సుకుమార్, సమంతల లవ్ ట్రాక్ తనకు బాగా నచ్చిందని.. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సీనుకు ముందు.. సమ్మూ, చెర్రీల మధ్య గల కిస్ సీన్ అదిరిపోయిందని.. సీన్ పండేందుకు సమంత కిస్ గురించి చెర్రీకి చెప్పలేదని సుకుమార్ చెప్పారు.
 
వారిద్దరి మధ్య రియాల్టీ కోసం అప్పటికప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసి.. రెండే రెండు టేకులతో సీన్‌ను 45 నిమిషాల్లోనే పూర్తి చేశామని సుకుమార్ తెలిపారు. రెండు సీన్ల కోసం రెండు రోజులు ప్లాన్ చేశామని.. మొదటి సీను ఒకటిన్నర రోజు తీసుకుందని.. రెండో సీన్ రెండో రోజు ముగించరని రవిగారు పందెం కట్టారని.. ఆ సీన్ రెండో రోజే పూర్తి చేస్తే పదిలక్షలిస్తామని బెట్ కట్టారని.. ఇదేదో బాగుందని.. స్క్రిప్ట్‌ను పూర్తి చేసి సీన్‌ను పూర్తి చేశారన్నారు.