శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 16 డిశెంబరు 2019 (17:21 IST)

'వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్'లో రాశీఖ‌న్నా లుక్ ఇదే

సెన్సేష‌న‌ల్ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. భిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా, రాశీఖన్నా నటిస్తున్నారు.

ఈ నలుగురు హీరోయిన్స్‌ పాత్రలకు, హీరో పాత్రకు ఉన్న రిలేషన్‌ ఏంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. డిఫరెంట్‌ లుక్‌, డ్రెస్సింగ్‌ స్టైల్‌తో విజయ్‌ దేవరకొండ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా లుక్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. తాజాగా రాశీఖన్నా లుక్‌ను హీరోతో ఆ పాత్రకు ఉన్న రిలేషన్‌ను విడుదల చేశారు.
 
రాశీఖన్నా పాత్ర పేరు యామిని.. దేవరకొండ పాత్ర పేరు గౌతమ్‌. ఐశ్వర్యాజేష్‌, క్యాథరిన్‌కు శీనయ్య, శ్రీనుగా.. ఇజాబెల్లె లెయితె, రాశీఖన్నాలకు గౌతమ్‌గా విజయ్‌దేవరకొండ పాత్ర పరిచయం ఉంది. “అతన్ని నా ప్రపంచంగా చేసుకున్నాను. నా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ గౌతమ్‌ను వేలంటెన్స్‌ డే సందర్భంగా కలుసుకుందాం’ అంటూ రాశీఖన్నా తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.
 
ఈ లుక్‌లో విజయ్‌దేవరకొండ, రాశీఖన్నా లుక్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. విజయ్‌దేవరకొండ నాలుగు గెటప్స్‌లో కనపడటానికి, వేర్వేరు పేర్లతో పిలవడానికి గల కారణాలు మాత్రం సీక్రెట్‌. జవనరి 3న సినిమా టీజర్‌ విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో కియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ మ్యూజిక్‌, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.