సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 6 డిశెంబరు 2019 (20:46 IST)

ఆమె చేస్తున్న ప్ర‌యోగాలు చూస్తుంటే ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది - రాశీఖ‌న్నా

ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై.. అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖ‌న్నా. ఈ అమ్మ‌డు తాజాగా వెంకీ మామ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర విశేషాల‌ను తెలియ‌చేస్తూ... ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌చేసింది.
 
రాశీ ఖ‌న్నా చెప్పిన మ‌న‌సులో మాట‌లు, ఆమె మాటల్లోనే...  నేను వెంకీ సర్ నటించిన సినిమాలు చిన్నప్పటి నుండి చూసేదాన్ని. టీవీలో డబ్బింగ్ సినిమాలు వచ్చేవి. అప్పటి నుండే ఆయన సినిమాలు తెలుసు. కానీ నేను ఆయన స్టార్‌గా కన్నా మంచి మనిషిగా నాకు తెలుసు. అందుకే నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని.
 
వెంకీ మామ‌, ప్ర‌తి రోజు పండ‌గే... నేను న‌టించ‌ని ఈ రెండు సినిమాలు వారం రోజుల తేడాలో రిలీజ్ అవుతున్నాయి. ఒకేసారి 2 సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నంత మాత్రాన నాకేం ప్రెజర్ లేదు. యాక్టింగ్ విషయంలో కూడా పెద్దగా డిఫెరెన్స్ అనిపించలేదు. ఒక్క వరల్డ్ ఫేమస్ లవర్ కోసమే ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అది చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్.
 
 ఇండస్ట్రీ చాలా మారిపోయింది. అమ్మాయిలకు కూడా మంచి క్యారెక్టర్స్ రాస్తుంటారు. నటిగా సమంతా చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు తను వెబ్ సిరీస్ కూడా చేయబోతుంది అని చెప్పి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట పెట్టింది.