సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 6 డిశెంబరు 2019 (18:40 IST)

ఆ ఒత్తిడిని నేను కూడా ఎదుర్కొన్నా: ప్రియాంకా చోప్రా

ఎటువంటి నేపథ్యం లేకుండా ఒంటరిగా సినీ ప్రయాణం ప్రారంభించిన తాను అప్పట్లో ఎంతో ఒత్తిడికి గురయ్యానంటోంది ప్రియాంకా చోప్రా. అంత ఒత్తిడికి కారణం ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడమేనంటోంది. ఓ చిత్రంలో భాగం కావాలంటే తారలు చాలామందిపై ఆధారపడాల్సి ఉంటుంది. దాని వల్ల ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడా పరిస్థితి నాకు లేదంటోంది.
 
ఇతరులపై ఆధారపడకుండా సినిమాల విషయంలో స్వంత నిర్ణయాలను తీసుకోవడం మొదలైనప్పటి నుంచి నా ఒత్తిడి మాయం అయిపోయింది. స్వంత నిర్ణయాల వల్ల నిర్మాతగా మారాలన్న ధైర్యమూ కలిగింది అంటూ తనలోని పరిణామాక్రమాన్ని వివరిస్తోంది ప్రియాంకచోప్రా. ఎంతన్నా సీనియర్ నటి కదా అందుకే ప్రియాంకాచోప్రా చెప్పే మాటలను స్నేహితులు ఆశక్తిగా వింటున్నారట.