ప్రియాంకకు సవతి పోరు? పాకిస్థాన్ నటితో నిక్ జోనాస్ షికార్లు

Mehwish Hayat
Last Updated: మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (13:24 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు సవతిపోరు వచ్చేలా ఉంది. ఎందుకంటే ఆమె కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న లండన్ సింగర్ నిక్ జోనాస్ ఇపుడు పాకిస్థాన్ నటితో షికార్లు చేస్తున్నాడు. దీంతో ప్రియాంకాకు సవతి పోరు తప్పేలా లేదు. ఈ మధ్య ఓ ఈవెంట్‌లో నిక్ ప్రియాంకతో కాకుండా పాకిస్థానీ నటి మెహ్విష్ హయత్‌తో కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటోని హాయత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

ఈ ఫోటో వెనుక గల కారణం వివరిస్తూ.. 'నేను, నిక్ జొనాస్ యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూడడానికెళ్లాం. రఫెల్ నాదల్ మా ఫేవరెట్ ఆటగాడు. అందుకే అతనికి ఛీర్స్ చెప్పడానికెళ్లాం. ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా నాదల్ గెలుస్తాడని మేమనుకున్నాం. అదే విధంగా జరిగింది. నాదల్ సెమీస్‌తో పాటు ఫైనల్లోనూ గెలిచి నాలుగోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడాడు' అంటూ ఆమె పేర్కొంది.

అయితే ఈ ఫోటోకు గల ప్రత్యేకత ఏమంటారా..! ప్రియాంక చోప్రా, ఫోటోలో ఉన్న పాకిస్థానీ నటి గతంలో ఇండియా, పాకిస్థాన్ ఆర్మీ విషయంలో విమర్శలు చేసుకున్నారు. ఇండియాను సమర్థిస్తూ ప్రియాంక, పాక్‌ను సమర్థిస్తూ హాయత్ వాదోపవాదాలు చేసుకున్నారు. అందుకనే నెటిజన్స్ ఈ ఫోటోను కాస్త ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఆమెతో ఉన్నతి మన ప్రియాంకా భర్త నిక్ కాబట్టి.Guess who I ran into at the Men's Semi Finals in New York! One thing we both agreed on was that we were both rooting for @rafaelnadal !
దీనిపై మరింత చదవండి :