సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 15 నవంబరు 2019 (14:30 IST)

నన్ను అలా చేసే వారంటే బాగా ఇష్టపడతా: రాశీ ఖన్నా

రాశీ ఖన్నాకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఏ హీరో పక్కనయినా బాగా సూటబుల్ అయ్యే హీరోయిన్ రాశీ ఖన్నా. అందుకే ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. విజయాలు వరించాయి. తన హావభావాలతో.. ఏ రకమైన క్యారెక్టర్ అయినా రాశీ ఖన్నా అవలీలగా పోషించగలదు అంటున్నారు సినీ విశ్లేషకులు. 
 
అయితే అలాంటి రాశీ ఖన్నా ఈ మధ్య కొన్ని ఆరోగ్యకరమైన విషయాలను స్నేహితులకు చెబుతోందట. అంతేకాదు తాను చెబుతున్న ఆరోగ్య విషయాలను తూచా తప్పకుండా పాటించాలని కూడా స్నేహితులను కోరుతోందట. ఇంతకీ రాశీ ఖన్నా స్నేహితులకు చెబుతున్న సూచనలు ఏంటంటే..
 
ఖర్చు లేకుండా మనస్సును అలరించే ఆభరణం నవ్వు. ఎటువంటి కష్టాల నుంచి అయినా బయట పడవేస్తుందట. నన్ను నవ్వించే వాళ్ళు నాకు బాగా నచ్చుతారు. నోరారా నవ్వితే రోగాలన్నీ మాయం అవుతాయి. మనసారా నవ్వితే ఎంత ఒత్తిడి అయినా పటాపంచలవుతాయి.
 
మనని నవ్వించే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోను వదులుకోకూడదు అని చెబుతోందట రాశీ ఖన్నా. అలాంటి వారంటే తనకు ఎంతో ఇష్టమని. కొంతమంది తనను అలా నవ్వించారని.. అందుకే అలాంటి వారిని తాను ఎప్పటికీ మర్చిపోలేనంటోంది రాశీ ఖన్నా. మీరు కూడా అలా చేస్తే సంతోషంగా ఉంటారని.. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుందని స్నేహితులకు హితబోధ చేస్తోంది ఈ భామ.