మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2016 (16:21 IST)

'దిల్' రాజు దెబ్బతో గింగరాలు తిరుగుతూ దిగివచ్చిన హీరో రవితేజ?

ప్రజాధారణ ఉంటే సినిమాలు సక్సెస్‌ అవుతాయి. అప్పుడు హీరోలు తమను తాము పెద్దగా ఊహించుకుంటారు. అలా ఊహించుకుని చివరికి జీరో అయిన కథనాయకులు చరిత్రలో చాలా మందే ఉన్నారు. దాదాపు అలాంటి అంచుకు వెళ్ళిన హీరో రవితే

ప్రజాధారణ ఉంటే సినిమాలు సక్సెస్‌ అవుతాయి. అప్పుడు హీరోలు తమను తాము పెద్దగా ఊహించుకుంటారు. అలా ఊహించుకుని చివరికి జీరో అయిన కథనాయకులు చరిత్రలో చాలా మందే ఉన్నారు. దాదాపు అలాంటి అంచుకు వెళ్ళిన హీరో రవితేజ. సినిమాలు సక్సెస్‌లు వచ్చాక.. పారితోషికం పెంచేస్తూ పోవడం.. దానికి నిర్మాత దిల్‌ రాజు చెక్ పెట్టడం అంతా చకచకా జరిగిపోయాయి. పైగా, ఈ విషయంలోనూ ఇద్దరి మధ్య చిన్నపాటి వాదన కూడా జరిగిందట. 
 
పైగా, రవితేజతో తీయాల్సిన దిల్‌ రాజు తీయాలనుకున్న 'ఒక్కడొచ్చాడు' సినిమాను రవితేజతో తీయకుండా.. కొన్నాళ్ళపాటు రవితేజ పేరు వినిపించకుండా చేశాడన్నది చిత్ర పరిశ్రమలో విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో చేసేది లేక కొంతకాలం విదేశాలకు వెళ్ళి అక్కడ అన్నీ వదిలేసి వచ్చినట్లుగా తెలుస్తోంది. 
 
పైగా, హైదరాబాద్‌కు రాగానే దిల్‌ రాజుతో కలిసి.. మెట్టుదిగడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని తెలుస్తోంది. త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రకటించనున్నారు. దీనికి అనిల్‌ రాపూడి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. త్వరలో వివరాలు తెలియనున్నాయి.