ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (09:19 IST)

ఏపీలో తెరుచుకున్న థియేటర్ : క్రాక్ సినిమాతో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. దీంతో ప్రభుత్వం అనేక రకాలైన సడలింపులు ఇస్తూ వస్తోంది. దీంతో అన్ని రకలా వ్యాపార కార్యకలాపాలు మెల్లగా ప్రారంభమవుతున్నాయి. దీంతో ఏపీలో ఒక థియేటల్ తెరుచుకుంది. 
 
నిజానికి కరోనా దెబ్బకు థియేట‌ర్స్ ప‌రిస్థితి దారుణంగా ఉంది. గ‌త ఏడాది తొమ్మిది నెల‌ల పాటు మూత‌ప‌డ్డ థియేట‌ర్స్ ఈ ఏడాది ఏప్రిల్ నుండి తెర‌చుకోలేదు. దీంతో సినీ ప్రియులు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం ఓటీటీల‌నే ఆశ్ర‌యిస్తున్నారు. 
 
అయితే ఇప్పుడిప్పుడే క‌ర‌నోనా త‌గ్గుముఖం ప‌డుతుండ‌డం, ప్ర‌భుత్వాలు వెసులు బాటు క‌ల్పిస్తుండ‌డంతో వైజాగ్‌లోని జ‌గ‌దాంబ థియేటర్ ‘క్రాక్’ సినిమాతో ప్రారంభ‌మైంది. ఎగ్జిబిట‌ర్స్, డిస్ట్రిబ్యూట‌ర్స్ ప‌లు ఆలోచ‌న‌లు చేశాక వైజాగ్‌లోని జ‌గదాంబ థియేట‌ర్ యాజ‌మాన్యం ధైర్యం చేసి ఈ థియేట‌ర్‌లో 'క్రాక్' సినిమాను 50 శాతం ఆక్యుపెన్సీతో ఆదివారం ప్రారంభించారు. 
 
ఈ ఏడాది విడుద‌లైన బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్లో ర‌వితేజ, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన 'క్రాక్' మూవీతో ఈ థియేట‌ర్ ఓపెన్ కావ‌డం విశేషం. 'క్రాక్' చిత్రం ఈ ఏడాది మొద‌ట్లో విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.