శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (16:18 IST)

'కౌన్‌ హే అచ్చా... కౌన్ హే లుచ్చా...' పాట‌కు స్పంద‌న‌ అపూర్వం

కొన్ని నిజాలు నిక్క చ్చిగా ఉంటాయి. అందులోనూ మ‌న హీరోలు వాటి గురించి మ‌రింత గ‌ట్టిగా చెబుతున్న‌ప్పుడు ఆ భావాలు శ్రోతల గుండెల్లోకి నేరుగా చొచ్చుకుని పోతుంటాయి. తాజాగా అలా జ‌నాల్లోకి వెళ్లిందే 'కౌన్‌ హే అచ్చా... కౌన్ హే లుచ్చా...' అనే పాట‌. రామ్ న‌టించిన "రెడ్" సినిమాలోని పాట ఇది. 
 
రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచీ అనూహ్య స్పంద‌న రాబ‌ట్టుకుంటోంది. ఈ పాట గురించి రీసెంట్‌గా పూరి జ‌గ‌న్నాథ్ 'థీమ్ అదిరింది' అంటూ ట్విట్ట‌ర్‌లో స్పెష‌ల్‌గా మెన్ష‌న్ చేశారు. అంత‌గా ప్రజాద‌ర‌ణ పొందిన ఈ పాట గురించి "రెడ్" టీమ్ స్పందించింది.
 
చిత్ర ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల మాట్లాడుతూ, 'సినిమాలో హీరో కేర‌క్ట‌ర్ ఎలివేష‌న్ కోసం సంద‌ర్భానుసారంగా వ‌చ్చే పాటే కౌన్ హే అచ్చా.. కౌన్ హే లుచ్చా... గేయ ర‌చ‌యిత క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తికి సంద‌ర్భాన్ని వివ‌రించగానే ప‌ర్ఫెక్ట్‌గా రాసిచ్చారు. ప్ర‌తి లైను బావుందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. 
 
స‌న్నిహితులు కూడా చాలా మంది ఫోన్లు చేసి, మాన‌వ నైజాన్ని అద్భుతంగా చెప్పారంటున్నారు. మ‌ణిశ‌ర్మ‌ బాణీని అనురాగ్ కుల‌క‌ర్ణి అద్భుతంగా సొంతం చేసుకుని పాడారు. ఆయ‌న స్వ‌రం పాట‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ తెచ్చిపెట్టింది. `రెడ్‌` నుంచి విడుద‌లైన ప్ర‌తి పాట‌నూ ప్రేక్ష‌కులు ఆస్వాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు.
 
నిర్మాత స్ర‌వంతి ర‌వికిశోర్ మాట్లాడుతూ, 'రెడ్ నుంచి ఏ పాట విడుద‌లైనా ప్రేక్ష‌కులు చ‌క్క‌గా ఆద‌రిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ‌ స్వ‌రాల‌కు ఎంత గొప్ప ఆద‌ర‌ణ ఉంటుందో మ‌రోసారి ప్రూవ్ అయింది. ఇంత‌కు ముందు రిలీజ్ చేసిన 'డించ‌క్ డించ‌క్‌...', 'నువ్వే నువ్వే' పాట‌ల‌కు కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇప్పుడు 'కౌన్ హే అచ్చా... ' పాట‌కు ఎక్స్ ట్రార్డిన‌రీ స్పంద‌న వ‌స్తున్నందుకు యూనిట్ అంతా ఆనందంగా ఉంది. 
 
`రెడ్‌`కి సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాం. రామ్ నుంచి ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటారో... దానికి త‌గ్గ‌ట్టు ఉంటుంది సినిమా`` అని అన్నారు. 
 
 
న‌టీన‌టులు
రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ , నాజ‌ర్ తదితరులు 
 
సాంకేతిక నిపుణులు
సంస్థ‌: శ్రీ స్ర‌వంతి మూవీస్‌, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.