శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (17:11 IST)

యువ‌త కన్ఫ్యూజన్ కు రిలీఫ్ మెరిసే మెరిసే- ప‌వ‌న్‌కుమార్‌

merise team
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'.  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దర్శకులు సుకుమార్, వీవీ వినాయక్ వీడియో సందేశం ద్వారా చిత్ర బృందానికి బెస్ట్ శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ,  యువత ఆలోచనలు, ఆశలు, కోరికల గురించి తీసిన సినిమా. 20 ఏళ్ల వయసున్న యువతీ యువకుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయాలి అనే విషయంలో స్పష్టత ఉండదు. అలాంటి అమ్మాయి వెన్నెల, అబ్బాయి సిద్ధు. వీళ్లు ఇద్దరు ఎలా తారసపడ్డారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఎలా సక్సెస్ అందుకున్నారు అనేదే ఈ సినిమా. వీళ్లిద్దరివీ సెన్సిబుల్ క్యారెక్టర్స్. సినిమా అంతా ఎక్కడా ఐ లవ్ యూ కూడా చెప్పుకోరు. కానీ వాళ్ల మనసులు ఒకరికొకరు అర్థమవుతుంటాయి. చిన్న సినిమాకు ఎన్నో కష్టాలుంటాయి. ఈ టైమ్ లో థియేటర్లలో రిలీజ్ అవసరమా అంటే అవసరమే అని చెబుతాను. ఎందుకంటే మన టెన్షన్స్ రిలీఫ్ అయ్యేది థియేటర్ లలోనే. సో థియేటర్ లకు వచ్చి మా శ్వేతా, దినేష్ పర్మార్మెన్స్ చూస్తారని ఆశిస్తున్నా  అన్నారు.
 
సంగీత దర్శకుడు కార్తీక్ కొడగండ్ల మాట్లాడుతూ, చ‌క్క‌టి మ్యూజిక్ కుదిరింది. విజయ్ ప్రకాష్, చిన్మయి, లిప్సిక, అనురాగ్ కులకర్ణి వంటి సింగర్స్ చాలా బాగా పాడారు. కనులతో రచించు కావ్యాలలో పాట పాడేప్పుడు విజయ్ ప్రకాష్, చిన్మయి చాలా ఎంజాయ్ చేశారు. దర్శకుడు పవన్ గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మన వాడిలా పని చేయించుకున్నారు. టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా అనిపించింది. నెక్ట్ కూడా మేము కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా. శేఖర్ కమ్ముల గారి సినిమాలా ప్లెజంట్ గా ఉంటుంది. అన్నారు.
 
నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ,  ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా మిగతా ఆర్టిస్ట్ లు అంతా చక్కగా నటించారు. మా సినిమాను థియేటర్ లలో చూసి మరిన్ని మూవీస్ చేసేలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. లిరిసిస్ట్ కృష్ణవేణి మాట్లాడుతూ, నేటి యూత్ కు బాగా నచ్చుతుంది. కొత్త రచయిత వస్తున్నారంటే కాదనకుండా ఎంకరేజ్ చేశారని తెలిపారు.
దినేష్ తేజ్‌, శ్వేతా అవస్థి మాట్లాడుతూ, చ‌క్క‌గా థియేట‌ర్ల‌లోనే సినిమా చూసి ఆనందించండని పేర్కొన్నారు.