సంబంధిత వార్తలు
- సాహో సెట్లో రొమాంటిక్ లుక్‌లో ప్రభాస్, శ్రద్ధ.. ఫోటో వైరల్
- నాపై దుష్ప్రచారం చేసారని డీజీపీకి ఫిర్యాదు చేసా: లక్ష్మీ పార్వతి
- జగన్ నేమ్ ప్లేట్ సిద్ధం.. సోషల్ మీడియాలో వైరల్.. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా?
- షణ్ముఖ్ జశ్వంత్.. అబ్బ నీ తియ్యని దెబ్బతో వచ్చేస్తున్నాడు.. (వీడియో వైరల్)
- పవన్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన రేణూ దేశాయ్.. ఇక ఆపండి..
నో డౌట్.. తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటా: రేణుదేశాయ్
రేణు దేశాయ్ రెండవ పెళ్లికి నిశ్చితార్థం చేసుకుని చాలా నెలలు గడిచాయి. అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వారికి ఇష్టం వచ్చినట్లు కామెంట్‌లు పెడుతున్నారు. దొంగతనంగా పెళ్లి చేసుకుని ఉంటుందని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిశ్చితార్థం సమయంలోనే పెద్ద ఎత్తున ఆమెపై వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి.
అందుకే పెళ్లి చేసుకుంటే వ్యతిరేకత ఎక్కువై భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఉందని పలువురు అనుమానపడుతున్నారు. కొంత మంది పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారా అని రేణు దేశాయ్‌ని నేరుగా ప్రశ్నిస్తున్నారట.
తనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ఆమె స్పందించింది. తానేమీ రహస్యంగా పెళ్లి చేసుకోలేదని, అంత అవసరం కూడా లేదని, ఇంత లోపు హడావుడి ఎందుకని అన్నారు. తన పెళ్లి గురించి ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని, త్వరలోనే అధికారికంగా అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
పూర్తి వివరాలు చెప్పకపోయినా తన పెళ్లికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటానని రేణూ దేశాయ్ చెప్పారు. తనకు కాబోయే భర్త కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా నుండి ఇండియా వచ్చాడు. ప్రస్తుతం పూణేలోని ఓ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని చెప్పింది. పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని, దాని గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్పింది.
తర్వాతి కథనం
