జగన్ నేమ్ ప్లేట్ సిద్ధం.. సోషల్ మీడియాలో వైరల్.. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా?

Last Updated: ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (09:33 IST)
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వేళ, వైకాపా పార్టీకి ప్రజలు పట్టం కడుతారని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. వైకాపా అభిమానులు విజయం సాధించేది తామేనని ఘంటాపథంగా చెప్తున్నారు.. సీఎంగా జగన్ రానున్నారని అంటూ, ఆయన పేరిట నేమ్ ప్లేట్‌ను తయారు చేయించి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 
 
"వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు" అంటూ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కనిపిస్తున్న నేమ్ ప్లేట్ ఇప్పుడు తెగ షేర్ అవుతోంది. నిన్నటికి నిన్న చంద్రబాబు, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ మార్ఫింగ్ ఫోటోను షేర్ చేయగా, అది కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. తన అసమర్థత, వైఫల్యాలను చంద్రబాబు వ్యవస్థలపై తోసివేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. 2014లో చంద్రబాబు ఈవీఎంలతోనే గెలిచాడని గుర్తుచేశారు. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు తమకున్న అవలక్షణాలను ఎదుటివారికి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ స్పీకర్ కోడెలపై దాడి ఘటనలో వైసీపీ నేత అంబటి సహా ముగ్గురు పార్టీ నేతలపై పోలీసులు కేసు పెట్టడంపై బొత్స మండిపడ్డారు.దీనిపై మరింత చదవండి :