మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:36 IST)

పవన్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన రేణూ దేశాయ్.. ఇక ఆపండి..

ఓటు ఎవరికి వేయాలో తనకు తెలుసంటూ..తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదంటూ..అదే పనిగా తనకు మెసేజ్‌లు వస్తుంటే చాలా చిరాకుగా ఉందని పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ వాపోయారు. 
 
తనను విసిగించవద్దంటూనే, తన ఓటు ఇక్కడ లేదని, తన ఓటు పూణె నగరంలో ఉందని, అక్కడ ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరగనుందని, అక్కడే తాను ఓటును వేయబోతున్నానని, అలాగే ఓటు ఎవరికి వేయాలో తనకు ఫుల్ క్లారిటీ ఉందని ఆమె తెలిపారు.
 
ఓటు హక్కు ప్రాధాన్యత గురించి తనకు క్లాసులు పీకడం మానాలంటూ తనకు సలహాలిస్తున్న ఫ్యాన్స్‌ని స్మూత్‌గా మందలించింది. తనకు ఎలాంటి సందేశాలు పంపవద్దని, సలహాలు ఇవ్వొద్దని పవన్ అభిమానులకు గట్టిగా సమాధానం చెప్పింది. తన వాల్‌పై ఫోటోలు పెట్టి రచ్చ చేయకండని విజ్ఞప్తి చేసింది. ఓటు వేయడం అందరి బాధ్యత అని ఆమె వివరించింది. 
 
ప్రస్తుతానికి రేణూ దేశాయ్ తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న చిత్రంలో అతడికి అక్కగా కనిపించనుంది. మరో ప్రాజెక్ట్ రైతు సమస్యలపై సాగే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చేస్తూ బిజీగా గడుపుతోంది.