శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:44 IST)

ఈవీఎంను ధ్వంసం చేయడం తప్పే : పవన్ కళ్యాణ్

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని పటమటలో ఓయన ఓటు వేశారు. 
 
ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎన్నికలు సజావుగా జరగాలని ఆయన కోరారు. అయితే, అనంతపురంలో జనసేన అభ్యర్థి మధుసూదన్‌ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేయడంపై స్పందిస్తూ, మధుసూదన్ గుప్తా చర్య ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. 
 
కానీ వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు తెలియకుండా ఇంతకు మించి ఏం చెప్పలేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. 
 
మరోవైపు, కృష్ణా జిల్లా గుడివాడ రూరల్‌ మండలం చౌటపల్లిలో 172, 173 పోలింగ్ బూత్‌లలో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళుతున్నాయని ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళితే వారు తక్షణం స్పందించి పోలింగ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత కొత్త ఈవీఎంను అమర్చి, మళ్లీ పోలింగ్‌ ప్రారంభించారు.
 
అలాగే విజయవాడలోని జమ్మిచెట్టు సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో... సైకిల్‌కు ఓటేస్తే బీజేపీకి పడుతుడడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆ కేంద్రంలో పోలింగ్‌ నిలిపివేశారు. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగాయి.