గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (12:18 IST)

పవర్ ఫ్యాన్సుకు గట్టి వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవర్ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి రేణూ దేశాయ్ పూణెలో ఉంటోంది. ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్.. ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ సంగతి ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది.
 
ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. 
 
రీసెంట్‌గా రేణు తన పిల్లలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఈ ఫోటోలో అకిరా తన చెల్లెలు ఆద్యను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసిన రేణు..123 లెక్క పెట్టే లోపు నేను మీ ముందు ఉంటా.. క్రేజీ ఫెలోస్.. మీ ఇద్దరూ నా సొంతం అంటూ సోషల్ మీడియాలో మెసెజ్ చేసింది. 
 
ఇందుకు నెటిజన్లు స్పందిస్తూ.. ఎంతైనా పవన్ కళ్యాణ్ రక్తం కదా అంటూ స్పందించారు. మీకు సైన్స్ తెలియదనుకుంటా. తెలిస్తే నేను సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. సైన్స్ పరంగా చెప్పాలంటే ఇద్దరిలో నా రక్తమే ప్రవహిస్తుంది. అమ్మతనం గురించి మాట్లాడుతుంటే నేను సైలెంట్‌గా ఉండలేనంటూ సదరు నెటిజన్‌కు రేణు దేశాయ్ కాస్తా గట్టిగానే ఇచ్చుకుంది.