సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (21:02 IST)

రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్... రైతులకు అండగా అమరావతిలో పర్యటన

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు గత 13 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతు తెలిపేందుకు, సంఘీభావం తెలిపేందుకు పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతాల్లో మంగళవారం పర్యటించనున్నారు. 
 
అయితే, మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి రానున్నారు. దీంతో పవన్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఎర్రబాలెంలో రైతులు నిర్వహించే ధర్నాలో పాల్గొంటారు. ఆ తర్వాత వెలగపూడి, మందడం వెళ్లి రైతులను కలవనున్నారు.
 
మరోవైపు, రాజధాని రైతులకు పూర్తి అండగా ఉంటామని పవన్ ప్రకటించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రాణాలు అడ్డేసి కాపాడుతామంటూ హెచ్చరించారు.