గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అమరావతిలో తాత్కాలిక రాజధాని.. ఆ ఘనత చంద్రబాబుదే...

ప్రజల అవసరాలు తెలుసుకుని అభివృద్ధి పనులు చేపట్టేందుకు నియోజకవర్గ పర్యాటక చేస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ బ్రాహ్మణ వీధి, నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి ఆంజనేయ వాగు వరకు తదితర ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. 
 
ఈ సందర్భంగా స్థానికులను మంత్రి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలలో అమరావతిని భ్రమరావతి చేసిన చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మించి అమరావతిని తాత్కాలిక రాజధాని చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 
 
ప్రజలకు సేవ చేసేందుకు వైఎస్ఆర్సీపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలోని 34 డివిజన్ కొండ ప్రాంతము నందు గత టిడిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామంటూ ప్రచారంతో కాలక్షేపం చేసింది అన్నారు. ఈ ప్రాంత ప్రజలు దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఇళ్ల పట్టాలు మంజూరు సమస్యను పరిష్కరిస్తామన్నారు. 
 
తాగునీరు నిమిత్తం 10 లక్షల రూపాయలతో వాటర్ పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు... అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు వాలంటీర్లకు సూచించారు. పర్యటనలో నగర పాలక సంస్థ  విద్యుత్తు శాఖ అధికారులు మరియు వైయస్సార్ సిపి పార్టీ శ్రేణులు పైడిపాటి మురళి, యుగంధర్ రెడ్డి,పైడిపాటి రమేష్, శ్రీను, ఆనంద్, రాజేష్, శ్రీనివాస రావు, గురుమాంతు మహేష్ తదితరులు ఉన్నారు.