ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Updated : బుధవారం, 23 మే 2018 (18:50 IST)

'ఆఫీసర్' ఫస్ట్ సాంగ్ రిలీజ్... ఎలా ఉందో తెలుసా?(వీడియో)

టాలీవుడ్ కింగ్ నాగార్జున - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం ఆఫీస‌ర్. సిన్సియ‌ర్ పోలీసాఫీర్ స్టోరీగా రూపొందుతోన్న ఆఫీస‌ర్ జూన్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందు

టాలీవుడ్ కింగ్ నాగార్జున - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం ఆఫీస‌ర్. సిన్సియ‌ర్ పోలీసాఫీర్ స్టోరీగా రూపొందుతోన్న ఆఫీస‌ర్ జూన్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సాంగ్‌గా 'నవ్వే నువ్వు' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. 
 
తండ్రీకూతుళ్ల మధ్య గల ఎమోషన్ దృశ్యాలతో ఈ సాంగ్ కొనసాగుతోంది. ఒకవైపున తండ్రీకూతుళ్ల మధ్యగల అనుబంధానికి అద్దం పడుతూనే, మరోవైపున వృత్తిపరంగా నాగ్‌కి సంబంధించిన యాక్షన్ సీన్స్ ఈ సాంగ్‌లో చూపించారు.
 
 సిరాశ్రీ రాసిన సాహిత్యానికి రవిశంకర్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా వుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. సాంగ్ చూడండి... 
 
 
మే 25న రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ... కొన్ని కార‌ణాల వ‌ల‌న జూన్ 1న ఆఫీస‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. శివ కాంబినేష‌న్లో వ‌స్తోన్న ఆఫీస‌ర్ ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.