శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (15:56 IST)

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వేడుకలో రిహాన్నా.. అంత తీసుకుందా?

Rihanna
Rihanna
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం పాప్ క్వీన్ రిహన్నా జామ్‌నగర్‌కు చేరుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ అతిథి జాబితాలో రిహన్న, మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్ పేర్లు వుండటం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. 
 
ఈ ఈవెంట్‌లో రిహానా స్టేజ్ పెర్‌ఫార్మెన్స్‌కు ఆమెకు అంబానీ దాదాపు 8-9 మిలియన్ డాలర్లు చెల్లించారని పుకారు ఉంది. ఇది దాదాపు 74 కోట్ల రూపాయలు. తాజాగా ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌లో రిహానా స్టేజ్ షోకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  
 
ఈ సందర్భంగా రిహన్నా తన "బర్త్‌డే కేక్", "పోర్ ఇట్ అప్" వంటి హిట్‌ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేశారు. ఈ ఈవెంట్‌లో రిహానా ప్రదర్శన గ్రాండ్ సెలబ్రేషన్స్‌లో హైలైట్‌గా నిలిచింది. పాప్ క్వీన్ భారతదేశంలో భారీ అభిమానుల సంఖ్యను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.