Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rishab Shetty: రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ డేట్ ఫిక్స్

Written By దేవీ
Updated: శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (18:23 IST)
Rishab Shetty Kantara: Chapter 1
2022లో విడుదలైన కాంతార బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. పాన్-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది.  హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
కాంతారా: చాప్టర్ 1 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ మూవీగా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. కాంతారా: చాప్టర్ 1 ట్రైలర్ 22 సెప్టెంబర్ 2025న మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  
 
ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అద్భుతమైన పోస్టర్ షేర్ చేశారు. హోంబలే ఫిలింస్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో కాంతార: చాప్టర్ 1 ఒకటి. ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, అర్వింద్ కాశ్యప్ సినిమాటోగ్రఫీ, వినేశ్ బాంగ్లాన్ ప్రొడక్షన్ డిజైనర్.
 
2022లో వచ్చిన మాస్టర్‌పీస్‌ కాంతార విజయన్ని కొనసాగించడంలో హోంబలే ఫిలింస్‌ ఎలాంటి రాజీ పడలేదు. ఈ చిత్రంలో 500 మంది యోధులు, సుమారు 3,000 మంది ప్రజలు పాల్గొనే ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందించారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో,  25 ఎకరాల పట్టణం నిర్మించి, దాదాపు 45–50 రోజులపాటు ఈ షూటింగ్ జరిగింది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఒకటిగా నిలిచింది.
 
ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం చేరువ కానుంది.

అన్నీ చూడండి

ఆగస్టు 20, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అంకుసాపూర్‌.. జిల్లాలో తొలి బాల్యవివాహ రహిత గ్రామం

ఘజియాబాద్‌లో వింత ఘటన.. పిల్లి అడ్డువచ్చిందని అమ్మాయి ఎగిరిపడిందా..? లేకుంటే? (video)

తండ్రికి తలకొరివి పెట్టిన పెద్ద కుమార్తె.. కుమారుడు ఏమయ్యాడంటే? (Video)

నోయిడా యువతి కథ.. పూణేలో హోటల్ రిసెప్షన్‌లో ఉద్యోగం.. కానీ ఓనర్‌కు దగ్గరై అలా దొరికిపోయింది..?

అన్నీ చూడండి

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు

తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు

ఎముక పుష్టి ఏమేమి తినాలి?

ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?

ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments