మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (15:47 IST)

రూ.400 కోట్ల బడ్జెట్‌తో రోబో 2.0: ఆస్కార్‌ అవార్డు ఖాయమా..?

రోబోకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న రోబో 2.0 సినిమా ప్రతిష్టాత్మకం కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. రోబో 2.0 కోసం రూ.400 కోట్లు కేటాయించినట్లు

రోబోకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న రోబో 2.0 సినిమా ప్రతిష్టాత్మకం కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. రోబో 2.0 కోసం రూ.400 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. భారత సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు అరుదైన ఘనత దక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్లకు పంపించే ఆలోచనలో కూడా ఉన్నారట.
 
సాధారణంగా ఈ సినిమా రిలీజైన తర్వాత వచ్చే రెస్పాన్స్.. స్టఫ్‌ ఆధారంగా ఆ సినిమాను ఆస్కార్‌కు నామినేట్ చేయాలా వద్దా అనేది కమిటీ నిర్ణయిస్తుంది. కానీ సదరు కమిటీతో సంబంధం లేకుండా ఈ సినిమాను ఆస్కార్‌కు పంపించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 
 
ఆస్కార్ అవార్డ్స్ లో చాలా విభాగాలుంటాయి. అయితే ఇండియన్ మూవీస్ ఎక్కువగా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అవుతుంటాయి. ఈ విభాగంలో రజనీకాంత్ సినిమాకు ఈసారి ఆస్కార్ వచ్చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి రోబోకు అంత సీనుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.