సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (20:24 IST)

ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్.. అమీర్ ఖాన్ అగ్రిమెంట్ బ్రేక్ చేశాడన్న జక్కన్న!

RRR
RRR
ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీగా  భారీ కలెక్షన్లను కురిపిస్తోంది. బాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలో బుధవారం ముంబైలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. అమీర్ ఖాన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
 
ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ.. "అమీర్ ఖాన్ , నాకు మధ్య ఒక ఒప్పందం ఉంది. కేవలం పేర్లు పెట్టి పిలిచుకోవాలని సర్, గారు అనే పదాలు ఉపయోగించుకోకూడదని ఇటీవల ఓ అగ్రిమెంట్ పెట్టుకున్నాం. ఆయన్ని సర్ అని కాకుండా ఏకే అని పిలవడానికి నేను ఇబ్బందిపడ్డాను. అమీర్ ఒత్తిడి చేయడంతోనే నేను ఆయన్ని ఏకే అని పిలిచాను. కానీ ఇప్పుడు ఆయన మా మధ్య ఉన్న అగ్రిమెంట్ బ్రేక్ చేసి నన్ను రాజాజీ అని పిలుస్తున్నారు" అంటూ చెప్పుకొచ్చారు