"ఆర్ఆర్ఆర్" సక్సెస్ - యూనిట్‌కు దిల్ రాజు గ్రాండ్ పార్టీ
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఆర్ఆర్ఆర్". రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించారు. అలియా భట్ హీరోయిన్. అజయ్ దేవగన్ కీలక పాత్రను పోషించారు. గత నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.750 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి, రూ.1000 కోట్లకు గురిపెట్టింది.
దీంతో చిత్రం బృందం ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. దీన్ని పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు "ఆర్ఆర్ఆర్" చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ గ్రాండ్ పార్టీకి "ఆర్ఆర్ఆర్" చిత్రం కోసం పని చేసిన యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ పార్టీకి రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలు తమ భాగస్వాములతో హాజరయ్యారు. ఇందులో అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి "నాట్టు నాట్టు" పాటకు స్టెప్పులు కూడా వేసి అందర్నీ ఆలరించారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.