1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (11:43 IST)

ఎఫ్‌3 -స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళు పోస్ట‌ర్ అదుర్స్‌

Venkatesh, Varun Tej,
నవ్వుల రైడ్ F2 సినిమాకు సీక్వెల్‌గా F3 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. అంతా కలిసి గతంలో కంటే రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవ‌లే చిత్రంలోని 'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు' సాంగ్ రిలీజ్ చేశారు. దానికి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.
 
తాజాగా మంగ‌ళ‌వారంనాడు మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఎఫ్‌3 -స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళు పోస్ట‌ర్ చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. వ‌రేణ్‌తేజ్  స్ట‌యిలిష్‌గా నిలుచొని క‌ళ్ళ‌ద్దాల‌తో స్ట‌యిలిష్‌గా వుంటే అంతే ఎట్రాక్ట్‌గా వెంక‌టేష్ లుక్స్ స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళుగా మీ ముందుకు వ‌చ్చేస్తున్నాం అన్న‌ట్లు పోస్ట‌ర్ వుంది. సోష‌ల్ మీడియాలో దీనికి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.
 
ఇప్ప‌టికే ఈ చిత్రం ఒక్క పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని మే 27 థియేట‌ర్ల‌లో అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. 
 
 రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.