శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (18:05 IST)

బిగ్ బాస్ కౌశల్ రైట్ మోషన్ పోస్టర్ బాగుంది - వెంకటేష్

Bigg Boss Kaushal, Venkatesh and others
మహంకాళి మూవీస్ పతాకం పై కౌశల్ మండ, లీషా ఎక్లైర్స్ (Leesha Eclairs) హీరో హీరోయిన్ గా శంకర్ దర్శకత్వం లో మహంకాళి దివాకర్, లుకలాపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "రైట్". మలయాళం లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన 'మెమోరీస్' చిత్రం రీమేక్ ఇది. ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్, మోషన్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతూ "కౌశల్ నటించిన రైట్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి జీతూ జోసఫ్ కథను అందించారు. బిగ్ బాస్ తర్వాత కౌశల్ నటిస్తున్న రైట్ చిత్రం మంచి విజయం సాధించాలి. మోషన్ పోస్టర్ బాగుంది. కౌశల్ కి ఈ చిత్రం సక్సెస్ కావాలి" అని కోరుకున్నారు.
 
హీరో కౌశల్ మండ మాట్లాడుతూ "బిగ్ బాస్ విన్ అయిన తర్వాత ఈ చిత్రం చేశాను. నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వెంకటేష్ గారితో విడుదల చేయాలి అని చాలా కాలంగా వెయిట్ చేస్తున్న, కరోనా వల్ల చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు నా కోరిక తీరింది. వెంకటేష్ గారు నా సినిమా పోస్టర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం జీతూ జోసెఫ్ గారి మెమోరీస్ చిత్రం రీమేక్ ఇది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, మీరు అందరు నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఉంటాను. ఈ చిత్రం మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. త్వరలో థియేటర్ లో విడుదల అవుతుంది. నేను బిగ్ బాస్ లో ఉన్నపుడు తెలుగు ప్రేక్షకులందరూ నాకు సపోర్ట్ చేసి విన్నర్ ని చేశారు. మీ అందరికీ గుర్తుగా నేను నా హృదయానికి దగ్గరగా టాటూ వేయించుకున్నాను. మీ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలి, అలాగే నా రైట్ చిత్రాన్ని చూసి నన్ను బ్లెస్స్ చేస్తారు అని కోరుకుంటున్నాను. నాకు ఏ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు దివాకర్ గారు మరియు లూకాలపు మధు గారికి ధన్యవాదాలు. 40 ఏళ్ల గా ప్రతి క్రాఫ్ట్ లో ఎంతో అనుభవం ఉన్న శంకర్ గారు ఈ చిత్రం దర్శకత్వం వహిస్తున్నారు. మన నిర్మాత దివాకర్ గారు సంజీవిని బ్లడ్ బ్యాంక్ తరపున లక్షల మందికి సహాయం చేశారు. నాకు చారిటీ అంటే ఇష్టం. దివాకర్ గారి ప్రతి మంచి పనికి నేను తోడుగా ఉంటాను. టాప్ టెక్నిషన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు"
 
నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ "బిగ్ బాస్ విజయం తర్వాత తొలిసారి కౌశల్ హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి లుక్ ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్ గారికి నా కృతజ్ఞతలు. షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉంది. త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు
 
నిర్మాత లుకలాపు మధు మాట్లాడుతూ "మా రైట్ మూవీ మొదటి పోస్టర్ ను మోషన్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేశారు. వారికి మా ధన్యవాదాలు. కౌశల్ గారు బిగ్ బాస్ తర్వాత ఈ చిత్రం లో హీరో గా నటించారు. కథ చాలా బాగుంది. మంచి విజయం సాధిస్తుంది" అని కోరుకున్నారు.