మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (15:41 IST)

డ‌బ్బు కోసం పార్టీ పెట్టిన వెంకటేష్, వరుణ్ తేజ్‌

Venkatesh, Varun Tej
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌లిసి మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్-ఫిల్డ్ ఎంటర్టైనర్ `ఎఫ్‌3`తో ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ని న‌వ్వుల‌లో ముంచెత్త‌డానికి ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
 
దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు ను విడుదల చేశారు. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ క‌థ డబ్బు చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే.
ఈ పాట కోసం దేవీ శ్రీ ప్రసాద్ చక్కటి బాణీని సమకూర్చారు. రామ్ మిర్యాల గాత్రం, భాస్కర భట్ల సాహిత్యం పాటను మరింత అందంగా మలిచాయి. విజువల్‌గా కూడా ఈ పాట ఎంతో స్టైలీష్‌గా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.
 
శ్రోతలను ఈ పాట ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు భిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పాటలో తమన్నా కూడా కనిపిస్తున్నారు. పాట చివర్లో సినిమాలోని నటీనటులంతా కూడా డబ్బు రావాలని చేసే ప్రార్థనలు అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది.
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
 నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ తదితరులు