శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (14:08 IST)

మే 27న వెంకటేష్, వరుణ్ తేజ్ చిత్రం ఎఫ్ 3

F 3 new still
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ఫన్-ఫిల్డ్ ఎంటర్టైనర్ `ఎఫ్‌3` ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందించనుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాస్త ఆల‌స్యంగా మే27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.
 
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా  ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు పాట విడుద‌లై విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ క‌థ డబ్బు చుట్టూ తిరుగుతుంది.
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ ,రాజేంద్ర ప్రసాద్, సునీల్ తదితరులు
సాంకేతిక బృందం-  డైరెక్టర్: అనిల్ రావిపూడి,  సమర్పణ: దిల్ రాజు,  నిర్మాత: శిరీష్,  బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,  కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి,  సంగీత : దేవీ శ్రీ ప్రసాద్,  కెమెరామెన్: సాయి శ్రీరామ్,  ఆర్ట్: ఏఎస్ ప్రకాష్,  ఎడిటింగ్: తమ్మిరాజు,  స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎస్ కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్